ముసుగు తీసిన జగన్! ఎన్నికల ముందే అరాచకానికి తెర: నారాలోకేష్

by Ramesh N |   ( Updated:2024-03-04 08:35:56.0  )
ముసుగు తీసిన జగన్! ఎన్నికల ముందే అరాచకానికి తెర: నారాలోకేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ముందే సీఎం జగన్ అరాచకానికి తెరలేపారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి ఖాయమని తేలడంతో సీఎం జగన్ ముసుగు తీసేసి.. బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ నియంతృత్వం తట్టుకోలేక వైసీపీ నేతలు టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు. టీడీపీ నేతల ఇళ్లపైకి ముఖ్యమంత్రి జగన్ పోలీసులను ఉసిగొల్పారని ఆరోపించారు.

జగన్ చేతిలో ఖాకీలు కీలుబొమ్మలవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర పరిస్థితి పై ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని, జగన్ తొత్తులుగా మారిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ ఏపీకి ప్రత్యేక పరిశీలకులను పంపించాలని, అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని విజ్ఞప్తి చేశారు.

Read More..

ఎన్నికల తర్వాత జగన్ భారీ ప్లాన్... తెలిస్తే షాకే...!

Advertisement

Next Story