- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నా తల్లిని అవమానించారు.. శానసమండలిలో బొత్సపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి(AP Legislative Council)లో ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ(MLC Botsa Satyanarayana), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) అరెస్టులపై చర్చకు వైసీపీ(Ycp) పట్టుబట్టింది. చైర్మన్ పోడియంను చుట్టిముట్టి సభ్యులు ఆందోళన చేపట్టారు. ఫార్మాట్‌లో రావాలని చైర్మన్ ఎంత చెప్పినా నిరసన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన శానసమండలిలో ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. గతంలో తమ పార్టీకి సంఖ్యాబలం తక్కువ ఉన్నా చంద్రబాబు సభకు వచ్చారని గుర్తు చేశారు. తన తల్లిని అవమానించిన తర్వాతనే చంద్రబాబు సభకు రాలేదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.