- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh: టీడీపీ మాజీ సర్పంచ్ దారుణ హత్య.. జగన్‌కు మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినా రాజకీయ హత్యలు మాత్రం ఆగడం లేదు. రోజు ఎక్కడో ఒకచోట వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలోని హోసూరు టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. తాజాగా, ఇదే ఘటనపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ సీఎం జగన్‌ను ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తూ.. ‘ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పని చేశాడనే పగతోనే శ్రీనివాసులు కళ్లలో కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంది’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.