AP Elections 2024: అది కుదరదని తెలిసే ఈ ప్రయత్నం.. నారా లోకేష్

by Indraja |   ( Updated:2024-03-27 15:00:24.0  )
AP Elections 2024: అది కుదరదని తెలిసే ఈ ప్రయత్నం.. నారా లోకేష్
X

దిశా వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ (x) వేదికగా సంచలన వ్యాఖ్యలు ఆరోపణలు చేశారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్ ను అధికారులు పట్టుకున్నారని వెల్లడించారు.

టిడిపి ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు.. మరి ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధంచేసిన డబ్బుల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారు? అని ఎద్దేవ చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజి బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని తెలిపారు.

Read More..

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. ఒకే రోజు రంగంలోకి బాబు, జగన్


Advertisement

Next Story