Nara Lokesh: ఆ సీఎం తిక్కోడా..? పుసుక్కున అంత మాట అనేశారేంటి భయ్యా!

by Indraja |   ( Updated:2024-02-29 14:29:26.0  )
Nara Lokesh: ఆ సీఎం తిక్కోడా..? పుసుక్కున అంత మాట అనేశారేంటి భయ్యా!
X

దిశ డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం మనిషి జీవితంలో సోషల్ మీడియా ఓ భాగమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చాలంది ప్రజలు సోషల్ మీడియాలోనే కలం గడుపుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన ఇంట్లోనే ఉన్న మాకు చిటికలో తెలిసిపోతుందంటే అది సోషల్ మీడియా మహిమే. అంధుకే సాధారణ ప్రజల నుండి సెలబ్రిటీలు, రాజకీనాయకుల వరకు సోషల్ మీడియాను వాడుతున్నారు.

ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులను విమర్శించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాను విరివిగా వాడే నాయకుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకరు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమిస్తూ వైసీపీ జాబితాను విడుదల చేసినది.

కాగా వైసీపీ విడుదల చేసిన జాబితాపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందించారు. వైసీపీ సమన్వయకర్తల జాబితా ఫోటోకి తిక్కొడు తిరునాళ్లకు పోతే.. ఎక్కా దిగా సరిపోయిందట.. అలా ఉంది వైసీపీ వరుస సమన్వయకర్తల జాబితాలు అనే క్యాప్షన్ జోడించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం లోకేష్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పోస్ట్ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Read More..

పవర్ స్టార్ ట్యాగ్ ఓకే.. పవర్ షేరింగ్ పరిస్థితేంటి?

Advertisement

Next Story