Nara Lokesh : ఆనాటి తొలిసి మొక్క నేడు గంజాయి మొక్కగా ఎలా మారింది..?

by Indraja |   ( Updated:2024-02-14 13:58:42.0  )
Nara Lokesh : ఆనాటి తొలిసి మొక్క నేడు గంజాయి మొక్కగా ఎలా మారింది..?
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశంపార్టీ జాతియ ప్రాధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ రోజు పార్వతీపురంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి డైయేరిాయా అనే జబ్బు వచిందని పేర్కొన్నారు. గుంటూరులో సురక్షితమైన త్రాగు నీరు కూడ అధికార ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు.

కలుషితమైన నీరు త్రాగడం కారణంగా గుంటూరులో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వందలాది మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్తితిని ఈ రోజు చూస్తున్నామని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న దున్నపోతు ప్రభుత్వం నిద్ర లేవడం లేదని వైసీపీపై మండిపడ్డారు. ఇంత మంది చనిపోతున్న ప్రభుత్వం సమీక్ష చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్యశాఖా మంత్రిని ఓ ప్రశ్న అడగాలి అనుకుంటున్నా అంటూ.. తెతుగుదేశం పార్టీ మహానాడులో మీరు ఆనాడు చంద్రబాబు నాయుడు నాటిన తొలసి మొక్కను అని అన్నారే..మరి ఆ తొలసి మొక్క నేడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారారో ప్రజలకి దయచేసి చెప్పమని కోరారు. ఇక జగన్ కి ఈ మద్యన సినిమా పిచ్చి ఎక్కువైందని.. అందుకే ఓ వైపు వ్యూహం మరో వైపు యాత్ర2 అంటున్నారని ఎద్దేవ చేశారు. డబ్బులు ఇచ్చి సినిమా చూడమంటున్నారంటే వైసీపీ అంతిమ యాత్ర మొదలైందని వెల్లడించారు.

Read More..

Breaking: రేపు ఆ రెండు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. కారణం ఇదే!

Advertisement

Next Story