AP Political News: మహిళలకు పాదాభివందనం చేసిన నారా లోకేష్.. ఎందుకంటే..?

by Indraja |
AP Political News: మహిళలకు పాదాభివందనం చేసిన నారా లోకేష్.. ఎందుకంటే..?
X

దిశ డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళకు పాదాభివందనం చేస్తున్న అంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేసారు. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళల గురించి కీలక వ్యాఖలు చేశారు. మహిళ అంటేనే స‌హ‌న‌మూర్తి, నిత్య‌స్ఫూర్తి అని కొనియాడారు. అలానే భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళా అని పేర్కొన్నారు.

అంతటి అనిత్యాన్ని కలిగిన మహిళలకు అంద‌రికీ తాను చేతులు జోడించి నమస్కారం చేశారు. అలానే మహిళలకు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ చేశారు. ఇక ఆ సభలో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ కి స‌హ‌న‌మూర్తి, నిత్య‌స్ఫూర్తి, భూమి కంటే ఎక్కువ భారం మోసే మ‌హిళ‌ల‌కు పాదాభివంద‌నం.

అంద‌రికీ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అనే ట్యాగ్ జోడించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story