Nara Lokesh: సైకో, ఫేక్ జగన్.. నాతో చర్చకు రెడీనా: నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

by Shiva |
Nara Lokesh: సైకో, ఫేక్ జగన్.. నాతో చర్చకు రెడీనా: నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో శాంతిభద్రతలపై మాజీ సీఎం, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు (Guntur) జీజీహెచ్‌ (GGH)లో బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయిన సహానా కుటుంబ సభ్యులను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని కామెంట్ చేశారు. అన్యాయంగా ఓ దళిత చెల్లి బలై పోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వంతో మహిళల భద్రతకు పెద్దపీట వేశామని.. ‘దిశ’ యాప్‌ (Disha Application)ను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

అయితే, మాజీ సీఎం జగన్ (Former CM Jagan) వ్యాఖ్యలపై తాజాగా, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ‘X’ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. సైకో, ఫేక్ జగన్.. నాతో చర్చకు రెడీనా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా టీడీపీ (TDP) ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. ‘దిశ’ యాక్ట్ (Disha Act) పూర్తిగా అబద్ధమని.. మహిళల భద్రత పేరుతో జరిగిన పెద్ద మోసం అని ఆరోపించారు.

2019-24 మధ్య 2,027 మంది మహిళలు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఒక్క నేరస్థుడిపై కూడా ‘దిశ’ చట్టం (Disha Act) కింద కేసు నమోదు కాలేదన్నది నగ్న సత్యం అని అన్నారు. వైసీపీ సర్కార్ (YCP Government) హయాంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు పని చేయడం లేదనే విషయం పూర్తిగా అవాస్తవమని నారా లోకేష్ (Minister Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed