Lokesh America Tour: సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

by Rani Yarlagadda |
Lokesh America Tour: సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రాన్ని కొత్త పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella)తో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. అలాగే రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ (Digital Governance) కు టెక్నికల్ సహకారం అందించాలని నారా లోకేష్ కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్ (AI Capital Amaravati)గా తీర్చిదిద్దేందుకు కూడా సహకరించాలని, ఒకసారి ఏపీలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు.

సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ గా ఉందని, 2023లో 211.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించినట్లు వివరించారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఏపీని సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంకా కొత్త ఐటీ హబ్ లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నామని, వాటిని ప్రపంచస్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ తో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ (Speed of doing business)లో మరిన్ని సేవల్ని రాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. స్టీమ్ లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పాలసీలతో సత్వర సేవలందుతాయని వివరించారు.

Advertisement

Next Story