- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kuppam Incident: సీఎం జగన్‌పై నారా లోకేశ్ తీవ్ర ఆగహం
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం చంద్రబాబు పర్యటనకు అనుమతి నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రం జగన్ జాగీరా? అని ప్రశ్నించారు. ఏపీలో ఏమైనా ఎమర్జెన్సీ విధించారా? అని నిలదీశారు. కుప్పంలో వైసీపీ పోలీసులు అప్రకటిత యుద్ధం ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ చట్టానికి బూజు దులిపి అర్ధరాత్రి జీవో తెచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యేగా చంద్రబాబు తన నియోజకవర్గంలో ఆంక్షలేంటని లోకేశ్ ప్రశ్నించారు. కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు ప్రజాదరణ తగ్గించలేరని చెప్పారు.35 ఏళ్లలో జగన్ లాంటి కుట్రదారుల్ని కుప్పం ఎంతోమందిని చూసిందన్నారు. టీడీపీ కంచుకోట కుప్పంలో వైసీపీ కుప్పిగంతులు చెల్లవని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుప్పం పర్యటనను ఆపలేరని లోకేశ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
కాగా మాజీ సీఎం చంద్రబాబును పోలీసులు కుప్పంలో అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కందుకూరు, గుంటూరు ఘటనతో సభలు, రోడ్ షోలు, ర్యాలీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు నుంచి సమాధానం లేకపోవడంతో కుప్పం చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే చంద్రబాబు కుప్పంలో పర్యటించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. అటు టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అధినేత పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఆందోళనకు దిగారు. 'కుప్పం అడ్డ.. చంద్రబాబు అడ్డాఅని కార్యకర్తలు నినాదాలు చేశారు.
Also Read: