- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: శంఖారావంలో నారా లోకేష్ కామెడీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు పాతపట్నంలో శంఖారావం భహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ పై కామెడీ పంచ్ లు వేశారు. జగన్ కి నిజం చెప్తే తల వంద ముక్కలవుతుంది అనే శాపం ఉందని..అందుకే రోజుకో అబధం చెప్తున్నారని ఎద్దేవ చేశారు. ఇక మోసానికి షార్ట్ ఫాంటు వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డిలా ఉంటుందని తెలిపారు. ఎన్నికల ముందు తియ్యగా మాయమాటలు చెప్పారని..దొరికన ప్రతి మహిళకు ముద్దులు పెట్టారని..ఇప్పుడు గట్టిగ గుద్దుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అని తెలిపారు. ప్రతి సంవత్సరం DSC ఇస్తానమని మోసం చేశారని పేర్కొన్నారు. ఇక జాబ్ క్యాలెండర్ కాస్త సాక్షి క్యాలెండర్ అయ్యిందని తెలిపారు. బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసివేశారని.. పీజీ ఫీజు రీఎంబెర్స్మెంట్ ఎత్తేశారని, విదేశీ విద్యను కట్ చేశారని ఆరోపించారు. అలానే ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్ట్లు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు జగన్ మాట తప్పారుఅని తెలిపారు.
ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో పనులు పూర్తి చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లు అని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు ఇక ఎన్నికలకు నాలుగు నెలలు ఉందనగా DSC నోటిఫికేషన్ ఇస్తూ ప్రజలను మాయచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికలకు ఇక నాలుగు నెలలు ఉండగా ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రకటించారని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో గ్రూప్ 2 పరీక్షలకు సంసిద్దమైయ్యేందుకు కనీసం నాలుగు నెలల సమయం ఉండేదని.. ఇప్పుడు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. సమయం ఇవ్వకపోయినా పోస్ట్లు అయినా ఇస్తారననుకుంటే కేవలం 897 పోస్ట్లు ఇచ్చారని.. ఈ ఉద్యోగాలకు 5 లక్షల మంది నిరుద్యోగులు పరీక్షలు రాసారని.. ఇది యువతీ యువకులను జగన్ చేసిన మోసం కదా అని ప్రశ్నించారు.
ఇక రెండు నెలలు ఓపికపట్టమని జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. అలానే DSC నోటిఫికేషన్ ద్వారా 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక యువతీ యువకులను అధైర్యపడవద్దని యువతకు పిలుపునిచ్చారు. రెండు నెలలు ఓపికపట్టండి మీ బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అని తెలిపారు. ఇక జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీసారని ఎద్దేవ చేశారు.
ఇక యాత్ర 2 కాస్త వైసీపీకి అంతిమ యాత్రగా మారిపోయిందని పేర్కొన్నారు. వాళ్ళ సొంత పార్టీ నాయకులు టికెట్లు కొని , ప్రజలకు డబ్బులు, మద్యం బాటిల్ ఇచ్చి సినిమా చూడమని ఆడుకుంటున్నారని విమర్శించారు. అయినా ఎవరు చూడడానికి ఇష్టపడడం లేదని ఎద్దేవ చేసారు. ఇక ఈ బిల్డప్ బాబాయ్ బాగా కట్టింగ్లు ఇస్తారని.. ఒక సభలో అర్జునుడు అంటారని, మరో సభలో అభిమన్యుడిని అంటరాని.. కానీ వాస్తవానికి జగన్ ఒక సైకో అని, ఒక భస్మాసురుడు, హిట్లర్, సద్దాం హుసేన్ లాంటి వ్యక్తి ఈ సైకో జగన్ అని పేర్కొన్నారు.
ఇక టీడీపీ చేసిన మంచి పనులపై రంగులు వేసి నేను చేశాను అని చెప్పుకునే జగన్ న్నీ చూస్తే జాలేస్తుంది తెలిపారు. ఇక తరతరుగా వస్తున్న మన భూమి పత్రాలపై ఆయన ఫోటోలు వేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జగన్ మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నారని ముఖ్యమంత్రి మన బిడ్డ అవుతున్నారని జాలిపడవద్దని..పొరపాటున రేపు ఎన్నికల్ల గెలిస్తే మీ బిడ్డను కనుక మీ భోమిలో వాటా ఇవ్వమని అడుగుతారని హాస్య చురకలు విసిరారు.
ఇక చంద్రబాబుల మంచిపేరు తెచ్చుకోవాలని జగన్ ట్రై చేసిన కుదరలేదని.. అందుకు కారణం జగన్ అంటే జైల్.. బాబు అంటే బ్రాండ్ అని తెలిపారు. జగన్ న్ని చూస్తే కోడికత్తి గుర్తుకు వస్తుందని.. బాబును చూస్తే కీయ కారు గుర్తొస్తుందని పేర్కొన్నారు. జగన్ చూస్తే ప్రిషనరీ, బాబును చూస్తే విషనరీ కనిపిస్తుందని పేర్కొన్నారు.