రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేశ్ సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

by srinivas |   ( Updated:2024-04-28 17:03:13.0  )
రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేశ్ సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. మే 13న ఎన్నికలు జరగనుంది. దీంతో ఆయా పార్టీల అధినేతలు, నాయకులు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మంగళగిరి అభివృద్ధిపై కీలక హామీలు ఇస్తూ నియోజవర్గం మొత్తం పర్యటించారు.

తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేశ్ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించారు. మే 30 నుంచి రోజూసాయంత్రం 4 గంటల నుంచి 6 వరకూ యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. అలా వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. మంగళవారం ఒంగోలులో యువతతో భేటీ కానున్నారు. మే1 నెల్లూరు, మే 2న రాజంపేట, మే3న కర్నూలు, మే4న నంద్యాల, మే5న చిత్తూరు, మే 6న ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. యువతనుద్దేశించి కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read More : చంద్రబాబు కోసం భార్య భువనేశ్వరి మరో సంచలన నిర్ణయం

Advertisement

Next Story