బ్రేకింగ్: పీలేరు TDP అభ్యర్థి ఫిక్స్.. బహిరంగా సభ సాక్షిగా ప్రకటించిన నారా లోకేష్

by Satheesh |   ( Updated:2023-03-05 13:02:31.0  )
బ్రేకింగ్: పీలేరు TDP అభ్యర్థి ఫిక్స్.. బహిరంగా సభ సాక్షిగా ప్రకటించిన నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ ఓ కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో ముస్లింలు కష్టాల, అవమానపడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని.. అక్రమంగా ఇసుకను ఏపీ నుండి బెంగళూరుకు తరలిస్తున్నారని ఆరోపించారు.

హంద్రీనీవా సహా రాష్ట్రంలో పలు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేదని.. చెక్ డ్యాములు కొట్టుకుపోతే కనీసం మరమ్మత్తులు చేయలేదని ధ్వజమెత్తారు. ఇక, ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థిని లోకేష్ ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి టీడీపీ తరుఫున బరిలోకి దిగుతారని పీలేరు బహిరంగ సభలో లోకేష్ ప్రకటించారు. కాగా, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే టీడీపీ పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story