ఏపీ సీఎం ఇజ్జత్ తీసిన మాజీ ముఖ్యమంత్రి.. అంత మాట అనేసాడేంట్రా బాబు..!

by Indraja |
ఏపీ సీఎం ఇజ్జత్ తీసిన మాజీ ముఖ్యమంత్రి.. అంత మాట అనేసాడేంట్రా బాబు..!
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి పార్టీ అడుగులేస్తోంది. అధికార పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా ఆచితూచి వ్యవహరిస్తుంటే.. విపక్షాలు విజయభేరిని మోగించి పార్టీ జెండాను రెపరెపలాడించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అధికార పక్షానికి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గు మంటోంది. యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉడుకు రక్తంతో సిద్ధం అంటూ ఉరకలేస్తుంటే.. అనుభవజ్ఞులు రాజకీయాల్లో ఆరితేరిన అపర చాణక్యుడు నారా చంద్రబాబు గెలుపును ఒడిసిపట్టుకునేందుకు నిమ్మళంగా ప్రణాళికలను రూపొందిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చురకలంటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఇక నిన్న అనంతపురంలో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్.. ప్రజల మధ్యలో ఏర్పాటు చేసిన ర్యాంప్ పై నడుచుకుంటూ వెళ్లారు. ఆ తరువాత తన ప్రసంగాన్ని ప్రజలకు వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సపందించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి.. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి.. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది..ఇంకా 50 రోజులే.

రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం.

దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం.. నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా.. దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ! అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story