- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి నారా భువనేశ్వరి స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావడంతోపాటు కేసుల నుంచి విముక్తి కలగాలని...అలాగే భువనేశ్వరి చేపట్టబోయే‘నిజం గెలవాలి’ కార్యక్రమం విజయవంతం అయ్యేలా దీవించాలని నారా భువనేశ్వరి స్వామివారిని వేడుకున్నారు. ఇకపోతే శ్రీవారి దర్శనార్థం నారా భువనేశ్వరి సోమవారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె తమ స్వగ్రామం నారావారిపల్లెకు బయలుదేరారు.నారావారిపల్లెలో తమ కులదేవతకు నారా భువనేశ్వరి పూజలు చేయనున్నారు. ఈనెల 25 నుంచి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.