నేడు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన..ఆ కుటుంబాలకు ఆర్ధిక సహాయం

by Indraja |   ( Updated:2024-02-20 07:35:38.0  )
నేడు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన..ఆ కుటుంబాలకు ఆర్ధిక సహాయం
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపత్ని నారా భువనేశ్వరి ఈ ఈ రోజు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు (మంగళవారం) ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుండి కుప్పంకి భువనేశ్వరి బయలుదేరారు.

కాగా ఈ రోజు కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అలానే చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఒక్కో కార్యకర్త కుటుంబానికి ఆర్ధికసాయంగా రూ.3 లక్షల చెక్కును అందించనున్నారు. ఇక చంద్రబ్బాబూ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెంది మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు నిజం గెలవాలి పేరుతో పలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తూ మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ ఆర్ధిక సహాయం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

Read More..

సొంత గూటికి చేరనున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి..నేడు జగన్ తో భేటీ

Advertisement

Next Story