- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు బెయిల్ రావడంపై నారా భువనేశ్వరి రియాక్షన్.. ఏమన్నారంటే..?
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. న్యాయం గెలిచింది.. జనం గెలిచారు అంటూ తెలిపారు. ఈ గెలుపు రాష్ట్ర ప్రజలందరిది అని, పోరాటం చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు అని భువనేశ్వరి చెప్పారు. నిజం గెలవాలి యాత్ర కొనసాగించాలా? లేదా? అనే దానిపై ఇంకా ఆలోచించలేదని, ముందు చంద్రబాబును చూడాలని భువనేశ్వరి పేర్కొన్నారు.
విజయనగరం రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించేందుకు భువనేశ్వరి విజయనగరం వచ్చారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో విజయనగరం నుంచి రాజమండ్రికి బయల్దేరారు. సాయంత్రం 4 గంటల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదల కానుండగా.. అక్కడ నుంచి విజయవాడ వరకు భారీ ర్యాలీకి టీడీపీ ప్లాన్ చేసింది. నేడు లేదా రేపు తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం తిరుమల నుంచి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందనున్నారు.