ఫ్యాషన్ షోకు వెళ్తున్న నారా భువనేశ్వరి: టీడీపీ బస్సుయాత్రపై మంత్రి రోజా సెటైర్లు

by Seetharam |
ఫ్యాషన్ షోకు వెళ్తున్న నారా భువనేశ్వరి: టీడీపీ బస్సుయాత్రపై మంత్రి రోజా సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇద్దరినీ ప్రజలు ఓడించారు అని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. ఇదేమీ కర్మరా బాబూ అని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని విమర్శలు చేశారు. 14 ఏళ్లలో మేం ఇది చేశామని ప్రజలకు చెప్పి ఓట్లు అడిగే దమ్ము టీడీపీకి ఉందా అని సవాల్ విసిరారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అంటూ యాత్ర చేయబోతున్నారని తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుంది అని చెప్పుకొచ్చారు. అలాగే ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో నిజం గెలవాలని సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్‌లో ఎవరెవరు ఉన్నారో అందరూ బయట పడతారు అని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశామని ఏనాడైనా ప్రజలకు తెలియజేసే దమ్ము టీడీపీకి ఉందా అని నిలదీశారు. మొదటిసారి సీఎం అయిన వైఎస్‌ జగన్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98 శాతం పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. వై ఏపీ నీడ్స్ జగన్‌ అని చెప్పి గడప గడపకు వెళ్తున్నాం. వై ఏపీ నీడ్స్ చంద్రబాబు, వై ఏపీ నీడ్స్ పవన్ కల్యాణ్ అని ప్రజల ముందుకు వెళ్ళే దమ్ము ఉందా..? అని సవాల్ విసిరారు. ప్రజలు మూతి పగలగొడతారని తెలుసుకున్న టీడీపీ, జనసేన ఏపీ హేట్స్ అనే ప్రోగ్రాంతో వెళ్తున్నారని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు.

యువగళానికి మంగళం

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి'యాత్రపై మంత్రి ఆర్‌కే రోజా సెటైర్లు వేశారు. భువనేశ్వరి యాత్ర జరగదని శాపనార్థాలు పెట్టారు. లోకేశ్ వల్లే కానిది భువనేశ్వరి వల్ల ఏమౌతుందని అన్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు మంగళం పాడారని...భువనేశ్వరి, లోకేశ్ ఫ్యాషన్ షోకు వెళ్తున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. భువనేశ్వరి నిజం గెలవాలని దేవుడికి పూజలు చేస్తున్నారని అంటే చంద్రబాబు జైలులోనే శాశ్వతంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఉన్నారని మంత్రి ఆర్‌కే రోజా చెప్పుకొచ్చారు. ఫ్యాషన్ షోకు వెళ్తున్నట్లు భువనేశ్వరి నిజం గెలవాలంటూ బస్సు యాత్ర చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. తన తండ్రి ఎన్టీఆర్ పై చెప్పులు వేసినప్పుడు, టీడీపీని లాకునప్పుడు, తండ్రి చావుకు కారణం అయినప్పుడే వీళ్లంతా ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, రాజధాని భూములు, ఐఆర్ఆర్ లో ఎన్నో స్కాంలు చంద్రబాబు చేశారన్నారు. ఇప్పటికైనా దోచిన డబ్బులు వెనక్కి ఇచ్చి, ప్రజలకు క్షమాపణ‌ కోరితే చంద్రబాబుకు బెయిల్ వస్తుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ అని‌ ప్రజలు డిసైడ్ అయ్యారని మంత్రి ఆర్‌కే రోజా చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story