నానికి వైసీపీ షాక్.. ఆ నియోజకవర్గాన్ని చూసుకోవాలని ఆదేశం..?

by Ramesh Goud |   ( Updated:2024-02-02 11:00:53.0  )
నానికి వైసీపీ షాక్.. ఆ నియోజకవర్గాన్ని చూసుకోవాలని ఆదేశం..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. విజయవాడ నుంచి స్థానిక ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి చేరువయ్యారు. టీడీపీ అధిష్టానం విజయవాడ ఎంపీ స్థానం నాని సోదరుడు కేశినేని చిన్నికి కేటాయించడంతో నాని పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ.. విజయవాడ సమన్వయకర్తగా ఉన్నారు. సోదరులిద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సోదరుడిపై ఎలాగైనా గెలవాలనే పంతంతో ఉన్నా నానికి వైసీపీ అధిష్టానం కూడా షాకిందని తెలుస్తొంది.

కేశినేని నానిని విజయవాడ ఎంపీ స్థానం నుంచి తప్పించి, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తొంది. ఏలూరులో జరగబోయే సిద్ధం సభకు జనసమీకరణ ఏర్పాట్లకు సంబందించి మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు కేశినేని నానికి అప్పగించారు. ఇందులో భాగంగానే గురువారం నియోజకవర్గానికి చెందని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక పార్టీ నేతలతో నాని సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో సభకు చేయాల్సిన ఏర్పాట్లతో పాటు, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే నాని కూడా మైలవరానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తొంది. దీంతో పార్టీయే మైలవరం తీసుకోవాలని సూచించిందా..? లేక తనే సోదరుడితో తలపడటం ఇష్టం లేక మైలవరానికి మొగ్గు చూపుతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.

మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణ ప్రసాద్ మంత్రి జోగి రమేష్‌తో ఉన్న విభేదాల కారణంగా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే పార్టీ కార్యాలయానికి వెళ్లి వచ్చిన ఎమ్మెల్యే వైసీపీ పై విమర్శలు చేశారు. అలాగే ఐదో తేదీ తర్వాత తదుపరి కార్యచరణ ప్రకటిస్తానని చెప్పడంతో, అతనికి పార్టీ సీటు లేదని కన్ఫామ్ అయినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలతో పాటు, సిద్ధం సభకు కూడా హాజరు కాలేనని అదిష్టానానికి వివరించినట్లు తెలిసింది. మైలవరం నియోజకవర్గం వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వర్గం కాగా, మరొకటి మంత్రి జోగి రమేష్ వర్గం. ఇప్పటికే జోగి రమేష్ ను పెనమలూరుకి ఇన్ చార్జి గా వైసీపీ నియమిండంతో, మైలవరాన్ని కేశినానికి అప్పగించిందనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే కేశినేని నానికి ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు మొండి చేయి చూపించినట్లే.

Read More Andhra Pradesh Election News

Advertisement

Next Story

Most Viewed