నందమూరి తారకరత్న చిన్ననాటి స్నేహితుడు కూడా ఆర్టిస్టే.. ఆయన ఎవరంటే..!

by srinivas |   ( Updated:2023-02-20 05:54:31.0  )
నందమూరి తారకరత్న చిన్ననాటి స్నేహితుడు కూడా ఆర్టిస్టే.. ఆయన ఎవరంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఒక్కరికీ చిన్న నాటి స్నేహితులు ఉంటారు. అయితే వారిలో బ్రెస్ట్ ఫ్రెండ్ ఒకరుంటారు.. అతనితోనే అన్ని విషయాలు పంచుకుంటారు. అలా నందమూరి తారకరత్నకు కూడా చిన్న నాటి స్నేహితుడు ఒకరున్నారు. ఆయనే ఖయ్యూం. ఈయన ఎవరో కాదు.. కమెడియన్ అలీ తమ్ముడు. తారకరత్నకు ఖయ్యూం చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరు కలిసి చదువుతుకున్నారు. తారకరత్న హీరో కాకముందు అలీ ఇంటికి వెళ్లేవారు. ఖయ్యూంతో కలిసి సినిమాలు, షికారులకు వెళ్లేవారట. ఖయ్యూం కూడా పలు సినిమాల్లో నటించారు. కానీ తారకరత్న, ఖయ్యూం కలిసి నటించలేదట. కానీ అలీతో కలిసి తారకరత్న నాలుగు సినిమాల్లో నటించారు. అలాంటి స్నేహితుడు తారకరత్న లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని కమెడియన్ అలీ తెలిపారు.


కాగా నందమూరి తారకరత్న గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం తారకరత్న పార్ధివదేహాన్ని ఆయన స్వగృహం హైదరాబాద్ శంకర్‌పల్లి మండలం మోకిలలో ఉంచారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. నటుడు అలీ కూడా తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తారకరత్న, తాను చివరిసారిగా 'ఎస్5' (S5 No Exit) సినిమాలో నటించామని చెప్పారు. ఈ సినిమాలో పది రోజులు కలిసి పని చేసినట్లు తెలిపారు. తారకరత్న పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఆర్టిస్టులను బాగా గౌరవిస్తారని అలీ పేర్కొన్నారు.

Advertisement

Next Story