- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేనొస్తున్నా : త్వరలో నందమూరి బాలకృష్ణ ఓదార్పుయాత్ర?
దిశ, డైనమిక్ బ్యూరో : అగ్రనటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, స్టార్ కాంపైనర్‌గా కేవలం ప్రచారానికే పరిమితమైన నందమూరి బాలకృష్ణ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? ఇందుకోసం ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. చంద్రబాబు నాయడును రిమాండ్‌కు తరలించడం, అరెస్ట్ చేసిన తీరును తట్టుకోలేక కొందరు గుండెపోటుతో మరణించారు. మరికొందరు అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కుటుంబాలకు పెద్దదిక్కును కోల్పోయిన వారంతా రోడ్డున పడ్డారు. దీంతో వారికి కొండంత అండగా నిలవాలని టీడీపీ నిర్ణయించింది. వారికి నందమూరి బాలకృష్ణ భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
నేనొస్తున్నా:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలుకు తరలించడం వంటి పరిణామాలను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్‌కు తరలించడాన్ని కొందరు తట్టుకోలేక పోయారని దాంతో గుండెపోటుతో మరణించడం, మరికొందరు వీరాభిమానులు బలవన్మరణాలకు పాల్పడ్డారని బాలకృష్ణ అన్నారు. ఈ విషాద ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబాలకు పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని బాలయ్య అన్నారు. త్వరలోనే ప్రతీ కుటుంబాన్ని తాను కలవబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటించారు. తన బావ చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ వంటి ఘటనలు తట్టుకోలేక మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. నేనున్నాను...మీ వద్దకు వస్తాను అని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
జగన్‌కు మనుషులంటే అలర్జీ
స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తితో పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ విషయంపై జనం ఆలోచించాలి అని సూచించారు. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుంది. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచించడం కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మనుషులేంటేనే అలర్జీ అని మండిపడ్డారు. ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు విదిల్చే స్వభావం జగన్‌ది అని అన్నారు. రూ.10 ఇచ్చి.. రూ.100 గుంజుకునే స్వభావం వైసీపీది అని అన్నారు. హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది.. ఇప్పుడు అభివృద్ధే లేదు అని బాలయ్య చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ మాట తప్పని పార్టీ అని...మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి మా పార్టీకి వారసత్వంగా వచ్చింది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు అని స్పష్టం చేశారు.
చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్
టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం. ఇప్పుడే కాదు.. ఇంకా కేసులు పెడతారు. జగన్ లండన్ ఎందుకెళ్లారు. ఇవాళే జగన్ ఏపీకి వచ్చాడంట.. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమో..? ప్రజాపక్షాన పోరాడతాం అని చెప్పుకొచ్చారు. మన శక్తి యువత.. వారిని స్ట్రీమ్ లైన్ చేయాలి అని పిలుపునిచ్చారు. కానీ జగన్ ప్రభుత్వం గంజాయికి బానిసలుగా మార్చేస్తున్నారు. హిందూపురంలో ప్రభుత్వాస్పత్రిలో పందులు.. పశువులు తిరుగుతున్నాయి. జగన్ ఏపీని ప్రపంచ పటంలో లేకుండా చేశారు. అభూత కల్పనలు సృష్టించి చంద్రబాబుపై కేసు పెట్టారు. అభివృద్ధికి సంక్షేమానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఓటమి తథ్యమనే భయంతో జగన్ ఈ కేసులు పెట్టించినట్టు కన్పిస్తోంది. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కదా అని చంద్రబాబును 16 రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ కేసును సృష్టించారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు సంబంధించి సీమెన్స్ సంస్థతో తొలి ఒప్పందం 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ట్రైనింగ్ నిమిత్తం డిజైన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ సరఫరా చేస్తే.. డిజైన్ టెక్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ వాటాగా 10 శాతం. హిందూపురంలో మేమూ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో మేళా నిర్వహించాం’ అని నందమూరి బాలకృష్ణ గుర్తు చేశారు.
Read More: ముందే ప్లాన్ చేసి చంద్రబాబుపై కేసు పెట్టారు: Nandamuri Balakrishna