జగన్‌కు న్యాయం చేయండి.. ప్రభుత్వానికి నాగబాబు షాకింగ్ రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
జగన్‌కు న్యాయం చేయండి.. ప్రభుత్వానికి నాగబాబు షాకింగ్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎదుట జనసేన నేత నాగబాబు ఆసక్తికర డిమాండ్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై దాడి కేసును త్వరగా విచారించి న్యాయం చేయాలని కోరారు. దాడి జరిగి ఐదేళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఇంతవరకు న్యాయం జరుగలేదని అన్నారు. దాడి చేసిన నిందితుడికి సరైన శిక్ష విధించాలని కోరారు. కాగా, వైఎస్ జగన్‌పై 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటననను ప్రస్తావించారు.

‘‘2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. ఐదేళ్లు అయినా కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు. ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి. కాబట్టి ఆయన కేస్ ని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి జగన్ మోహన్ రెడ్డికి న్యాయం చెయ్యవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎంను, డిప్యూటీ సీఎంను, హోం మంత్రిని కోరుకుంటున్నాను’’ అని సెటైరికల్ ట్వీట్ పెట్టారు.


Advertisement

Next Story