సీఎం జగన్ ఇచ్చే ఇళ్లన్నీ ఓ బూటకం.. జనసేన నేత అక్కల గాంధీ

by Javid Pasha |
సీఎం జగన్ ఇచ్చే ఇళ్లన్నీ ఓ బూటకం.. జనసేన నేత అక్కల గాంధీ
X

దిశ, మైలవరం: సీఎం జగన్ ఇచ్చే ఇళ్లన్నీ ఓ బూటకం అని మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రాంమోహన్ రావు (గాంధీ) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈలప్రోలలో జగనన్న కాలనీలను సందర్శించి అక్కల గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ, చిన్నపాటి వర్షం వస్తే ఫౌండేషన్ తో సహా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం లక్షా ఎనబై వేలు ఇచ్చి పేద ప్రజలను ఇల్లు కట్టుకోమంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనికిరాని భూములలో ఒక సెంటు భూమి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటుందన్నారు. 680 ఎకరాలకు గాను కేవలం 250 ఎకరాలు మాత్రమే ఇల్లు మొదలుపెట్టారన్నారు. మిగిలిన 400 ఎకరాలు నిరుపయోగంగా ఉందని అక్కల గాంధీ తెలియజేశారు. పేదవాడిని మోసం చేసే ప్రభుత్వంగా వైసిపి మిగిలిపోయిందన్నారు. ఇక్కడ పేదలకు ఇచ్చిన కొన్ని స్థలాలలో ఇల్లు కూడా కట్టుకోనే పరిస్థితి లేదన్నారు. రోడ్లు సరిగా లేకపోవటం వలన ఇసుక,సిమెంట్ తోలుకోవలన్నా అధికంగా డబ్బులు అవుతున్నాయని

ఇల్లు కట్టుకునే కొంతమంది చెపుతున్నారన్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే 9 నుంచి 10 లక్షలు దాకా అవుతుందని చెపుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే బూటక ప్రజలు వినే పరిస్థితిలో లేరని, త్వరలోనే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపుతారన్నారు. ప్రజలకు న్యాయం జరగలంటే జనసేన పార్టీ తోనే అన్నారు. జనసేన పార్టీతోనే మార్పు మొదలవుతుందన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరూ అన్ని సౌకర్యాలతో వాళ్లు కోరుకున్నట్టుగా ఇళ్లు కట్టించి ఇస్తామని అక్కల గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, స్థానికులు పాల్కొన్నారు.

Advertisement

Next Story