Police Case: పేర్ని నాని తనయుడు కిట్టుపై హత్యాయత్నం కేసు

by srinivas |   ( Updated:2024-05-03 10:31:40.0  )
Police Case: పేర్ని నాని తనయుడు కిట్టుపై హత్యాయత్నం కేసు
X

దిశ, వెబ్ డెస్క్: మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు, వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యా కేసు నమోదు అయింది. మచిలీపట్నం 8వ డివిజన్‌లో నివాసముండే జనసేన నాయకుడు కర్రి మహేశ్ ఇంటిపై దాడి చేసిన కేసులో ఆయనను ఏ1గా పోలీసులు నమోదు చేశారు. పేర్ని కిట్టుతో పాటు వైసీపీ నాయకులు చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జనసేన నేత కర్రి మహేశ్ నివాసం వద్ద భారీగా బాణా సంచా పేల్చారు. దీంతో నిప్పురవ్వలు మహేశ్ ఇంటిలోకి పడ్డాయి.

అయితే అక్కడనున్న మహిళలు ప్రశ్నించడంతో పేర్ని కిట్టుతో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. కర్రి మహేశ్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన మహేశ్‌పైనా దాడి చేశారు. ఈ కేసులో నిందితులుగా పేర్ని కిట్టుతో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టును తప్ప మిగిలిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కర్రి మహేశ్ పైనా పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మహేశ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నారు. బాధితుడినే నిందితుడిని చేశారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story