- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ వద్దు.. టీడీపీ, జనసేనా ముద్దు.. ముద్రగడ
దిశ వెబ్ డెస్క్: ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం అనేది సహజం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. మార్పులు చేర్పుల కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవంతరభరితంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరనున్నారు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బుధవారం రోజు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడతో భేటీ అయ్యారు. కాగా ఈరోజు టిడిపి నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడతో భేటీ అయి చాలా సమయం చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేనతో కలిసి పని చేసేందుకు ముద్రగడ పద్మనాభం ఆసక్తి చూపిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు స్పందించారు.
మీడియాతో మాట్లాడిన గిరిబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి టిడిపి లేదా జనసేన ఏ పార్టీ లోకి అయిన వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తన తండ్రికి ఆసక్తి లేదని ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు. తన తండ్రి తో పాటు తనకు కూడా పోటీ చేయాలనే ఆసక్తి ఉందని.. ఏదైనా పార్టీలో చేరిన తర్వాత ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్, పత్తిపాడు, పిఠాపురంలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నట్లు ఆయన మనసులో మాట బయటపెట్టారు. కాగా గతంలో చెప్పినట్టు ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన టిడిపి లేదా జనసేన ఏదో ఒక పార్టీలో చేరడం మాత్రం పక్కా అని పేర్కొన్నారు.