MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-29 06:55:37.0  )
MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ ఎంపీ మిథన్ రెడ్డి (MP Mithun Reddy)కి బిగ్ రిలీఫ్ దక్కింది. పుంగనూరు అల్లర్ల కేసు (Punganur Attack Case)లో నిందితుడిగా ఉన్న ఆయనకు కాస్త ఊరట లభించింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు (AP High Court)తీర్పు వెలువరించింది. ఆయనతో పాటు మరో ఐదుగురికి బెయిల్ మంజూరైంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎంపీ మిథున్ రెడ్డి జులైలో పుంగనూరు పర్యటనకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ - వైసీపీ ల మధ్య దాడులతో మినీయుద్ధమే జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ సిబ్బంది సహా 12 మందికి పైగా గాయాలపాలయ్యారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప, మరికొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 307 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జులై 18న రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటనపై ఆ మర్నాడు హత్యాయత్నం సహా 2 క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు భయంతో ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించిన మిథున్ రెడ్డికి తాజాగా ఊరట లభించింది.

Advertisement

Next Story