- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన అధికార పార్టీ ఎంపీ
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ రాజమండి ఎంపీ మార్గాని భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం రాజమండ్రి వైసీపీ ఆధ్వర్యంలో ‘సిద్ధం’ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఎంపీ భరత్ ఆదిరెడ్డికి చెప్పు చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్‌ను అప్పారావు బెదించాడని మండిపడ్డారు. అంతేకాదు.. బహిరంగ సభలోనే ఎంపీ భరత్ అప్పారావు ఆడియోను వినిపించారు. ఓటమి ఖాయమని టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు.
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని చెప్పారు. సంపూర్ణ మెజార్టీలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంత మంది కలిసి గుంపుగా వచ్చినా జగన్‌ను ఓడించలేరని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని విమర్శించారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు సొంతంగా పోటీ చేయగలగాలని.. కానీ, పవన్ కల్యాణ్ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వ్యక్తిగత లాభం కోసం పార్టీని నడుపుతూ జనసైనికులను మోసం చేస్తున్నారని విమర్శించారు.