వెన్నుపోటు విషయాన్ని Jr. NTR గుర్తించాడు.. MP భరత్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
వెన్నుపోటు విషయాన్ని Jr. NTR గుర్తించాడు.. MP భరత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రిలో భారీ స్థాయిలో టీడీపీ నిర్వహిస్తోన్న మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెటైర్లు వేశారు. రాజమండ్రిలో నిర్వహించేది టీడీపీ మహానాడు కాదని.. రాజకీయంగా వాళ్లకి చివరినాడు అని ఎద్దేవా చేశారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించాడని.. అందుకే టీడీపీ మహానాడుకు తారక్ దూరంగా ఉన్నాడని ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను కాదని లోకేష్‌కు పట్టం కట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచి మళ్లీ జయంతి ఉత్సవాలు జరపడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారిందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed