AP News:గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు: ఎంపీ కేశినేని

by Jakkula Mamatha |
AP News:గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు: ఎంపీ కేశినేని
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్(MP Keshineni Shivnath) తెలిపారు. నేడు(గురువారం) మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఎంపీ అధ్యక్షతన ఏసీఏ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధితో పాటు, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి 16 అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన పై చర్చించినట్లు పేర్కొన్నారు. విశాఖ, మంగళగిరి క్రికెట్ మైదానాల్లో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. 35 ఎకరాలు కావాలని సీఆర్డీఏకు లేఖ రాసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం మూడు చోట్ల(విజయవాడ, అనంతపురం, వైజాగ్‌) క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు. అకాడమీలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా మంగళగిరి క్రికెట్ స్టేడియం నిర్లక్ష్యానికి గురై నిర్మాణాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. 12 సంవత్సరాల క్రితం నిర్మించడం వల్ల ఈ స్టేడియం స్టేచర్ పాడైపోయింది. ఆధునికంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తామపి తెలిపారు. అవసరమైతే స్టేడియం పునః నిర్మాణం చేస్తాం. స్టేడియంకి వచ్చే రోడ్లన్నీ రూపురేఖలు మారుస్తాం అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి. వెంకట రామ ప్రశాంత్, సెక్రెటరీ సానా సతీష్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ దంతుగౌరు విష్ణు తేజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story