కాపులకు జరిగిన అన్యాయం దేశంలో మరే వర్గానికి జరగలే: GVL కీలక వ్యాఖ్యలు

by Satheesh |
కాపులకు జరిగిన అన్యాయం దేశంలో మరే వర్గానికి జరగలే: GVL కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ, టీడీపీలు కాపులను మోసం చేశాయని ఏపీ బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ అన్నారు. కాపులకు జరిగిన అన్యాయం దేశంలో మరే వర్గానికి జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్లపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల చట్టం కేంద్రానికి పంపి అటకెక్కించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని కేంద్రంపైకి నెట్టాలని చూస్తున్నారని.. ఇలా ప్రయత్నించే గతంలో టీడీపీ దారుణంగా దెబ్బతిన్నదన్నారు. చివరికి వైసీపీ ప్రభుత్వానికి అదే పరిస్థితి తప్పదన్నారు. అంతేకాకుండా వైసీపీని గద్దె దించాలని ప్రజలు కూడా డిసైడ్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుందని విమర్శించారు.

Advertisement

Next Story