Viveka Case: చంచల్‌గూడ జైలుకు అవినాశ్ రెడ్డి..

by srinivas |   ( Updated:2023-06-15 12:28:11.0  )
Viveka Case: చంచల్‌గూడ జైలుకు అవినాశ్ రెడ్డి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ములాఖత్‌లో భాగంగా గురువారం ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కలిశారు. ఇటీవల భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇందులో భాగంగా తండ్రి ఆరోగ్య పరిస్థితిని అవినాశ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తండ్రికి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.

మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తండ్రికి అవినాశ్ రెడ్డి తెలిపారు. ఇదే కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సైతం ఏ-8 నిందితుడిగా ఉన్నారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై 19న విచారణ జరగనుంది.

Advertisement

Next Story