మంగళగిరిలో ఓటు @ 4 వేలు

by srinivas |
మంగళగిరిలో ఓటు @ 4 వేలు
X

దిశ ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగుకు మరో 48 గంటల సమయం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ఆయా పార్టీల తరపున అభిమానులు డబ్బుల పంపిణీ ప్రారంభించారు. అధికార పార్టీ నేతలు ప్రధాన ప్రత్యర్థుల నేతలు పోటీ చేస్తున్న నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా టీడీపీలో నెంబర్2గా ఉన్న నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాన్ని వైసీపీ నేతలు తమ టార్గెట్‌లో ఒకటి‌గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించాలన్న లక్ష్యంతో అక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు రంగంలోకి దిగి లోకేశ్‌ను ఓడించాలంటూ ఓటుకు 4 వేలు పంచుతున్నట్టు తెలుస్తోంది. అడపా దడపా కొన్ని ప్రాంతాల్లోని ఓటర్లకు వారు అడిగే దాన్ని బట్టి డబ్బులు ఇస్తున్నట్టు సమాచారం.

ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించాలన్న కసితో అధికార పార్టీ నేతలు పట్టుదలతో పని చేస్తున్నారు. అయితే లోకేశ్‌ను గెలిపించాలన్న పట్టుదలతో కొందరు నాయకులు పని చేస్తున్నారు. దీన్ని లోకేశ్ ఎలా తిప్పి కొడతారో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story