‘రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు’.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

by Jakkula Mamatha |
‘రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు’.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల తెలిపారు. ఏలూరు ఇంఛార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రి నాదెండ్ల కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల మెట్రిక్ టన్నులకు పైగా అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. మొదటి రకం వడ్లను మద్దతు ధర రూ.2,350తో కొంటామన్నారు. రైతులు వారికి నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. గోనె సంచులు, హమాలీ, రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story