ఎమ్మెల్సీ అనంత‌బాబుకు హైకోర్టులో ఊర‌ట‌..

by Hajipasha |   ( Updated:2022-08-23 15:59:02.0  )
ఎమ్మెల్సీ అనంత‌బాబుకు హైకోర్టులో ఊర‌ట‌..
X

దిశ, ఏపీ బ్యూరో : ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన తల్లి మంగారత్నం మరణంతో ఆయనకు రాజమహేంద్రవరం ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కోర్టు మూడు రోజులపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజమహేంద్రవరం ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు తీర్పును ఎమ్మెల్సీ అనంతబాబు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మరికొన్ని రోజుల పాటు బెయిల్ ఇవ్వాలని మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం సెప్టెంబర్ 5 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో రాజమహేంద్రవరం ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇచ్చిన 3 రోజుల బెయిల్‌కు అద‌నంగా 11 రోజుల పాటు బెయిల్ ల‌భించిన‌ట్లైంది.

Advertisement

Next Story