- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ravindra Singh Bhati: వీడు మగాడ్రా బుజ్జీ.. కాంగ్రెస్, బీజీపీనే తొక్కేశాడు..
దిశ వెబ్ డెస్క్: అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చునేకంటే అవకాశాన్ని సృష్టించుకోవడం మేలు అని నమ్మిన వ్యక్తి ఆయన. నాకు రాజకీయ భిక్ష పెట్టండి అని ఎవరిని అడుక్కోలేదు. ఒంటరిగానే అడుగులు వేసాడు. ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలో దిగారు. ప్రముఖ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో తలపడ్డారు. 26ఏళ్లకే ఎమ్మెల్యే పదవిని కైవసం చేసుకున్నారు.
అతనే రాజస్థాన్‌కి చెందిన రవీంద్ర సింగ్ భాటీ. ఈయన మొదట బీజేపీలో చేరారు. అయితే బీజేపీ ఆయనకి టికెట్ నిరాకరించింది. దీనితో ఆయన బార్మర్ జిల్లాలోని షియో నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రముఖ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొని 4 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ప్రస్తుతం ఈయన బార్మర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర MP అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే రవీంద్ర విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తాను చదివిన వర్సిటీలో కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు.