Tirupati: స్పీకర్ పదవిపై క్లారిటీ ఇచ్చిన RRR

by srinivas |   ( Updated:2024-06-14 11:50:33.0  )
Tirupati: స్పీకర్ పదవిపై క్లారిటీ ఇచ్చిన  RRR
X

దిశ, వెబ్ డెస్క్: ఉండి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణంరాజు గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు స్పీకర్ పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రఘురామకృష్ణంరాజు స్పందించారు. తిరుపతిలో RRR ఇడ్లీ పేరుతో ప్రారంభమైన హోటల్‌ను ప్రారంభించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కాదని.. ఏ పదవి ఇచ్చినా తాను సిద్ధమేనని చెప్పారు. ఎలాంటి పదవి ఇవ్వకపోయినా ఫీల్ కానని చెప్పారు. తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. జగన్ అరాచకాలపై నాలుగున్నరేళ్లపాటు సుధీర్ఘ పోరాటం చేశామని, దాని ఫలితంగానే అధికారంలోకి రాగలిగామని పేర్కొన్నారు. గతంలో శాసన మండలిని రద్దు చేస్తామన్న జగన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ వ్యవస్థ వద్దని, శాసనమండలి రద్దు చేస్తామని చెప్పిన జగన్‌కు ఇప్పుడు శాసనసభే కావాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ వ్యవస్థను చంద్రబాబు రద్దు చేస్తారని తాను అనుకోవడం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

Advertisement

Next Story