మాజీ ఎమ్మెల్యే ఔట్.. ఆదోనిలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే పార్థసారథి

by Jakkula Mamatha |
మాజీ ఎమ్మెల్యే ఔట్.. ఆదోనిలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే పార్థసారథి
X

దిశ ప్రతినిధి, కర్నూలు:మూడు దశాబ్దాల క్రితం టీడీపీలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేలా చేశాయి. ప్రధాని మోడీ అంటే తనకు ఇష్టమంటూనే ఆ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ నేతలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం పై పార్టీ ఫైర్ అయింది. వేటు వేస్తారని తెలిసి ముందే రాజీనామా డ్రామాకు తెరలేపారు. పార్టీ తీసుకున్న క్రమ శిక్షణ చర్యలపై సిట్టింగ్ ఎమ్మెల్యే చక్రం తిప్పి తన పంతం నెగ్గించుకున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

మూడు గ్రూపులు..

కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆదోని నియోజకవర్గ కూటమిలో నెలకొన్న విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. చాలా కాలంగా బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మధ్య వైరం నడుస్తోంది. ఎన్నికల ముందు నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుత ఎమ్మెల్యే చెక్ పెట్టారనే ప్రచారం జోరందుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, ప్రకాశ్ జైన్‌లు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కూటమి ఒప్పందంలో భాగంగా ఆదోని టికెట్ ను టీడీపీ అధినేత బీజేపీకి కేటాయించారు. అక్కడ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన డాక్టర్ పార్థసారథి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పై 18,164 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే అక్కడ కూటమి విజయం సాధించినా కూటమిలో నేతలు మూడు గ్రూపులుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ఒక గ్రూపు, మరో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఒక గ్రూపుగా ఉండగా గుడిసె కృష్ణమ్మ ఎమ్మెల్యే పార్థసారధికి సపోర్ట్‌గా నిలిచారు. ఇలా కూటమి నేతలంతా మూడు వర్గాలుగా ఉన్నారు. ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed