అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న లక్ష్యం.. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

by Javid Pasha |
అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న లక్ష్యం.. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
X

దిశ, ఆత్మకూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశ్యంతో వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలను అందచేసేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని అరుంధతీయవాడ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పత్రాలను అందచేశారు.

అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సచివాలయం పరిధిలో సుమారు 1200 గృహాల్లో వాలంటీర్లు, గృహసారధులు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించారని, అందులో భాగంగా 868 ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి రోజుల వ్యవధిలోనే అందచేయడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం అందచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికి చేరువ చేసేందుకు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ధృవీకరణ పత్రాలు పొంది వాటితో సంక్షేమ పథకాలకు అర్హతత సాధించవచ్చునని పేర్కొన్నారు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటన సందర్భంగా ప్రజలు తెలిపిన ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఎంతో ముందుచూపుతో ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందచేయడం జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని, ఆ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.2.50 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందచేశారని వివరించారు.

ప్రజలకు పారదర్శకంగా పథకాలను అందచేసేందుకు సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారని, తద్వారా ఎటువంటి అవినీతికి తావులేకుండా పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని వివరించారు. తాము నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పర్యటిస్తున్న సమయంలో ప్రజలందరిని ఒక ప్రశ్న తప్పనిసరిగా అడుగుతున్నామని, మీ వాలంటీర్ ఎలా విధులు నిర్వహిస్తున్నారో చెప్పాలని కోరుతున్నామని, ప్రజలంతా తమ వాలంటీర్లు అన్ని రకాల సేవలు అందచేస్తున్నారని చెబుతున్నారని వివరించారు. అందరి సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలంతా మరోమారు ఆశీర్వదించేందుకు సిద్దంగా ఉన్నారని, 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తధ్యమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed