Breaking News: జగన్ పెత్తందారులకే ప్రాధాన్యత ఇచ్చారు.. ఎమ్మెల్యే ఎలిజా

by Indraja |
Breaking News: జగన్ పెత్తందారులకే ప్రాధాన్యత ఇచ్చారు.. ఎమ్మెల్యే ఎలిజా
X

దిశ వెబ్ డెస్క్: సీట్ల విషయంలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు వైసీపీలో చిచ్చు పెడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ నుండి బయటకు వెళ్లిపోగా. మరి కొంతమంది నేతలు పార్టీని వదిలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వైసీపీ అధిష్టానం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన తనను వైసీపీ పార్టీ మోసం చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ కోసం పని చేసిన తనని పార్టీ పక్కన పెట్టిందని.. పెత్తందారుల మాట వినే అలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చింతలపూడి లో పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందని.. ఈ యుద్ధంలో పెత్తందారులనే ముఖ్యమంత్రి జగన్ గెలిపించారని.. వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల మాటకు మాత్రమే విలువ ఇస్తారని.. అసలు రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి సీఎం జగన్ కు ఏమీ తెలియదని.. రాష్ట్రంలో జరుగుతున్న ఏ విషయాలు కూడా జగన్ దృష్టికి వెళ్ళవని ఆయన పెత్తందారులు ఇచ్చిన రిపోర్టులను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఎలిజా ఆరోపించారు.

అలానే తనకు ఎంపీ కోటగిరి శ్రీధర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో తాను పెత్తందారుల కాళ్ళ పై పడలేదన్న ఒక కారణంతో తనని వైసిపి అధిష్టానం పక్కన పెట్టిందని ఎమ్మెల్యే ఎలిజా ఆవేదన వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గంలో పని చేసింది లేనిది ఆ నియోజకవర్గ ప్రజలను అడిగితే తెలుస్తుందని.. అంతేకాని పేతందార్లు ఇచ్చిన తప్పుడు రిపోర్టులను నమ్మి తనని పక్కన పెట్టడం న్యాయం కాదని ఎమ్మెల్యే ఎల్లజా మండిపడ్డారు. ఇలా చేయడం కేవలం పొమ్మన లేక పొగ పెట్టడమే అని ఆయన పేర్కొన్నారు.

పార్టీ నిర్వహించే సర్వేలో రిపోర్ట్లు కరెక్ట్ గానే ఉన్నా జగన్ ను కొంతమంది పెత్తందార్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను సరిగా పని చేయలేదని.. అందుకే అధిష్టానం పక్కన పెడుతుందన్న జగన్మోహన్ రెడ్డి ఏ రిపోర్టులు ఆధారంగా తనని పక్కన పెట్టారో ఆ రిపోర్టులను తనకు చూపించాలని డిమాండ్ చేసారు. అలానే తన దగ్గర ఉన్న రిపోర్టులను కూడా తను బయటపెడతానని సవాల్ చేశారు. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం నుండి బరిలో ఉన్న వైసీపీ టీడీపీ జనసేన అభ్యర్థులందరూ కూడా పెత్తందారులే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisement

Next Story