- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking News: వైసీపీ రాజీనామా ఇవ్వనున్న మరో ఎమ్మెల్యే..
దిశ వెబ్ డెస్క్: వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు ఆ పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ నుండి బయటికి వచ్చేసారు. మరి కొంతమంది నేతలు పార్టీకి నుండి బయటకు వచ్చేందుకు సంసిద్ధులవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పిఠాపురం ఎమ్మెల్యే పెడం దొరబాబు కూడా వైసీపీకి రాజీనామా ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం పెడం దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో దొరబాబుని పక్కన పెట్టి ఆయన స్థానాన్ని కాకినాడ ఎంపీ వంగ గీతకు కేటాయించింది అధిష్టానం.
దీనితో తీవ్ర అగ్రహానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా ఇచ్చి వైసీపీకి బైబై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గం పిఠాపురం లో ఆత్మీయ సమేవేశాన్ని నిర్వహించనున్నారు. నియోజకవర్గం లోని నాలుగు మండలాలకు చెందిన తన అనుచరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సమావేశానికి విచ్చేసిన వారి కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ఆయనకు తన నియోజకవర్గంలో ఉన్న బలాన్ని ప్రదర్శించాలి భావిస్తున్నట్లు సమాచారం.