- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబుకు మంత్రి జోగి రమేశ్ సవాల్
దిశ,డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళ సముదాయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీకి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్లలో కట్టిన ఇళ్లెన్ని.?, అవి ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా అంటూ సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్ల మీద చంద్రబాబు చేసిన ట్వీట్స్ చూస్తే.. పిల్ల చేష్టల్లా ఉన్నాయని విమర్శించారు. 74 ఏళ్ళ వయసు..44 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేయని పనిని, చేసినట్లుగా చెప్పుకుంటూ సెల్ఫీలు దిగటం..దాన్ని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది అని అన్నారు. మీ హయంలో పునాది దశకే పరిమితమైన టిడ్కో ఇళ్లను మా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి, మౌలిక సదుపాయలు కల్పిస్తే.. దాన్ని నీవేదో ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గు లేదా అని చంద్రబాబు నాయుడును మంత్రి జోగి రమేశ్ నిలదీశారు. టిడ్కో ఇళ్ళు, షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో చంద్రబాబు హంగామా చేసి, చివరకు పేదల మీద అప్పు భారం వేస్తే.. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ భారాన్ని మొత్తం తగ్గించి పేదవాళ్ల కు వాటిని అందించే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
బాబుకు ఛాలెంజ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్‌కు తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి జోగి రమేశ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 50 లక్షల గడపల దగ్గరకు రావడానికి, ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో చర్చించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా..? అని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న 17 వేల జగనన్న కాలనీలు మాతో పాటు వచ్చి చంద్రబాబు చూస్తే గుండె ఆగి చస్తాడు అని హెచ్చరించారు. ఇవాళ 17వేల జగనన్న లేఅవుట్లు...ద్వారా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నాం. కొన్నిచోట్ల పదివేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక మున్సిపాల్టీయే ఏర్పడుతుంది.ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యక్షంగా చూసేందుకు రావాలని మంత్రి జోగి రమేశ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. జగనన్న కాలనీల పురోగతి, పనితీరు మీద చర్చకు ఎక్కడకు రమ్మన్నా నేను వచ్చేందుకు సిద్ధం. ఒకవేళ మాతో నారా లోకేష్ వచ్చినా తీసుకువెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. లోకేశ్‌కు పనిపాట లేక రోడ్ల వెంట తిరుగుతూ బస్సు ఎక్కి ఫోటో, ఆటో దగ్గర ఫోటో దిగి పెడుతున్నాడు. మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సిగ్గులేదా? అని నిలదీశారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుకు రేపో, మాపో మూర్ఛ రోగం వస్తోందని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు.
చంద్రబాబుకు సవాల్
నారా లోకేశ్‌కు మాతో పోటీపడే దమ్ము, ధైర్యం లేదు. కేవలం సెల్ఫీలు తీసి, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టి హడావుడి చేస్తున్నాడు అని మంత్రి జోగిరమేశ్ విమర్శించారు. చంద్రబాబు అయినా నారా లోకేశ్ అయినా గుడ్డ కాల్చి మొహాన వేసి తుడుచుకుని వెళ్లిపోయే రకాలు. మీ ట్వీట్లకు స్పందించాం. మా ఛాలెంజ్ కు మీరు సిద్ధమా? మీకు స్పందించే గుణం ఉంటే.. తండ్రికొడుకులు వచ్చేందుకు సిద్ధమా? మీ పాదయాత్రలో ఎక్కడైనా పాల్గొనేందుకు నేను సిద్ధం. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, చీమూ, నెత్తురు ఉంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజల వద్దకే వెళ్తి తేల్చుకుందామని అందుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ప్రతి గడప దగ్గరకు వెళ్లి ప్రతి అక్కచెల్లెమ్మను అడుగుదాం. మీ హయాంలో చేసిన అభివృద్ధి, మేలు- మా నాలుగేళ్ల పాలనలో జరుగుతున్న మేలుపై వారినే నేరుగా అడుగుదాం అని వ్యాఖ్యానించారు. మీలా దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం మాకు చేతకాదు అని మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు.
175 సీట్లలో పోటీ పెట్టేసీన్ ఉందా?
2024 ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ 175, వై నాట్ కుప్పం.. ఇవే మా టార్గెట్‌లు అని చెప్పుకొచ్చారు. 175 స్థానాల్లో మమ్మల్ని ఓడిస్తామంటున్న చంద్రబాబు నాయుడుకు అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ ఉందా? అదే ఉంటే పొత్తుల కోసం పొర్లాడటం ఎందుకు? అని సెటైర్లు వేశారు. దమ్ము, ధైర్యం లేని చవటలు, సన్నాసులు జగన్‌తో పోటీనా? ఒక వీరుడిని ఎదుర్కొనేందుకు ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా.. సింహం ముందు దిగదుడుపే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీ గుర్తుతో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం అని మంత్రి జోగి రమేశ్ అన్నారు.