AP News:‘జగన్ ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు’.. మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |   ( Updated:2024-12-04 11:23:00.0  )
AP News:‘జగన్ ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు’.. మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పై రాష్ట్రం సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి(Dola Sri Bala Veeranjaneya Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇంకా భ్రమలో బతుకుతున్నారని మంత్రి అన్నారు. నేడు(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్(Reimbursement of Fees) చెల్లించలేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనివ్వలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్(Reimbursement of Fees) విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేం చర్యలు తీసుకున్నామన్నారు. కమిషన్ల గురించి మాట్లాడే అర్హత వైఎస్ జగన్ రెడ్డికి లేదు. అవినీతి, కమిషన్లలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు తీసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. కమిషన్ల గురించి వైఎస్ జగన్ మాట్లాడుతుంటే వైసీపీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో దళితుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. భ్రమలో ఉంటే పూర్తిగా పతనం అవుతారని మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed