- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గెలుపు మనదే.. సంబురాలకు సిద్ధం కండి: మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో ప్రజలకు తెలియాలని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోచుకున్న డబ్బును దుబాయ్‌లో దాచుకోవడానికి వెళ్లారా? అని అడిగారు. జూన్ 4వ తేదీన కూటమిని ప్రజలు సమాధి చేస్తారని అన్నారు. చంద్రబాబుతో పాటే దత్తపుత్రుడు కూడా కనిపించకుండా పోయాడని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అధికారులను బదిలీ చేసిన చోటే అల్లర్లు జరిగాయని అన్నారు. ఈసీని అడ్డుపెట్టుకొని కుట్రలు చేశారని మండిపడ్డారు. ఎన్నికుట్రలు పన్నినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కూడా ప్రజల ఆశీస్సులతో గెలువబోతున్నామని జోస్యం చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని జాతీయ సర్వే సంస్థలన్నీ వెల్లడిస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించినా కూడా ఏపీలో వైసీపీ ఎగరబోతోందని, శ్రేణులు సంబురాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.