- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh:‘ఎవరిని వదిలిపెట్టను’..రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రి లోకేష్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే దీనికి కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ..‘రెడ్ బుక్’ గురించి ఈ రోజు(శుక్రవారం) నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. రెడ్ బుక్ గురించి నేను చేసిన ప్రతి ప్రసంగం గమనించండని నారా లోకేష్ తెలిపారు. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్లని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పానని మంత్రి లోకేష్ అన్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ గారి అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూముల పత్రాలు తీసుకుని, నకిలీ పత్రాలు సృష్టించారని ఫైరయ్యారు. వారికి రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు. అగ్రిగోల్డ్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూములు అమ్మేసి డబ్బులు సంపాదించిన వారి పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. రేపు మద్యం వ్యవహారంలోనూ చర్యలు తీసుకుంటాం, ఇసుక దందాల్లోనూ చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలేది లేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.