మంత్రి ఉష శ్రీచరణ్‌కు స్థాన చలనం..ఈసారి పోటీ అక్కడ నుంచే

by Seetharam |
మంత్రి ఉష శ్రీచరణ్‌కు స్థాన చలనం..ఈసారి పోటీ అక్కడ నుంచే
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర మంత్రి ఉష శ్రీచరణ్‌కి స్థానచలనం కలిగింది. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి కాకుండా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మంత్రి ఉష శ్రీచరణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు టికెట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం టికెట్ బోయ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం నుంచి కాకుండా పెనుకొండ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో ఆమె పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఉష శ్రీచరణ్ మీడియాతో మాట్లాడారు. సామాజిక వర్గాల సమీకరణాలలో భాగంగానే నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు తెలిపారు. తాను వచ్చే న్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తాము నియోజకవర్గాలు మారినా.. ఎక్కడి నుంచి పోటీ చేసినా తమ నినాదం మాత్రం జగన్ నినాదం అని చెప్పుకొచ్చారు. పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యతని.. అధిష్టానం ఆదేవాలను తాను శిరసా వహిస్తానని తెలిపారు. ఇకపోతే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి శంకరనారాయణకు ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ శంకరనారాయణను అనంతపురం ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed