రాష్ట్రంలో గుడిలేని ఊరు ఉండకూడదు.. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

by Javid Pasha |
రాష్ట్రంలో గుడిలేని ఊరు ఉండకూడదు.. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉండకూడదని, ప్రజల్లో భక్తిభావాలు పెంపొదించేందుకు ప్రతి ఊరిలో గుడి నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ధర్మాన్ని పరిరక్షించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు వెల్లడించారు. రూ.10 లక్షలతో ప్రతి గ్రామంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 1,330 దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయని, డిపార్టుమెంట్‌గా 900 దేవాలయాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అదనంగా 1465 దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నాం.

వీటితో పాటు మరో 200 ఆలయాలు నిర్మించేలా ఈ రోజు సమావేశంలో కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆలయ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. దేవాదాయ శాఖ నుంచి 970 ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి 25 దేవాలయాల నిర్మాణాలకు అవుట్‌ సోర్సింగ్‌లో ఏఈ స్థాయి అధికారిని నియమించాం. ఇప్పటి వరకు రూ.230 కోట్లు సీజీఎస్‌కు కేటాయించాం. మ్యాచింగ్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లించి సమాచారం పంచించారు. ఇంచుమించు రూ.270 కోట్లతో సీజీఎఫ్‌ ద్వారా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. భగవంతుడి అనుగ్రహం పొందేలా, మంచి అలవాట్లు అలవర్చుకోవచ్చు అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Next Story

Most Viewed