మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే దృష్ట సంస్కృతికి తెరలేపిందే మంత్రి రోజానే: వంగలపూడి అనిత

by Seetharam |   ( Updated:2023-10-04 06:38:57.0  )
మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే దృష్ట సంస్కృతికి తెరలేపిందే మంత్రి రోజానే: వంగలపూడి అనిత
X

దిశ, డైనమిక్ బ్యూరో : మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే దృష్ట సంస్కృతికి తెరలేపిందే మంత్రి ఆర్‌కే రోజానే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. టీడీపీ నేతలు ఏదో అన్నారని రోజా కంట తడిపెట్టారు..ఇలాంటి కంటతడిలు తాము ఎన్నోసార్లు పెట్టామని అన్నారు. వంగలపూడి అనిత బుధవారం మీడియాతో మాట్లాడారు. మరి మగవాళ్ల గురించి రోజా నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చా? అని నిలదీశారు. దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా తన గురించి రోజా అసభ్యంగా మాట్లాడారు అని గుర్తు చేశారు. మాజీమంత్రి పీతల సుజాతను బాడీ షేమింగ్ చేసింది రోజా కాదా? అని నిలదీశారు. ఆరోజు ఆడతనం, మహిళ అన్న అంశాలు రోజాకు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ఇవాళ రోజా నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? అని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవా? మా ఫిర్యాదులపై ఇప్పటివరకు విచారణ జరగలేదు అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ కుటుంబాన్ని తిట్టినప్పుడు ఏమైంది నీ ఆడతనం?

రాష్ట్రంలో అసభ్య పదజాలానికి ఆద్యం పోసిందే మంత్రి ఆర్‌కే రోజా అని ఆరోపించారు. మంత్రి ఆర్‌కే రోజా తన పట్ల ఎంతగానో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అసెంబ్లీలో రోజా వెకిలి చేష్టలు, వికృత చేష్టలతో తమపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. నాడు అసెంబ్లీలో తనపట్ల మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు తమ కుటుంబం టీవీ చూసేందుకు సైతం భయపడ్డామని ఆమె అన్నారు. అంతేకాదు నాడు మంత్రి పీతల సుజాత పట్ల మంత్రి ఆర్‌కే రోజా చేసిన వ్యాఖ్యలు గుర్తుకు రావడం లేదా అని అన్నారు. పీతల సుజాత బాడీ షేమింగ్‌పై చట్ట సభలలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో రోజా మరచిపోయినట్లు ఉన్నారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను మీడియా ఎదుట వంగలపూడి అనిత బయటపెట్టారు. అంతేకాదు అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కామ సీఎం అంటూ వ్యాఖ్యలు చేసింది వాస్తవం కాదా అని వంగలపూడి అనిత నిలదీశారు. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబం గురించి ఎలాంటి అసభ్యకరమైన పదజాలంతో రోజా మాట్లాడారో ఆ వీడియోలను సైతం వంగలపూడి అనిత బయటపెట్టారు. నాడు మహిళ అనే విషయం రోజాకు గుర్తు లేదా నేడే గుర్తుకు వచ్చిందా అని వంగలపూడి అనిత అన్నారు. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల వల్ల ఎంతోమంది నాయకులు, నాయకురాలు కంటిమీద కునుకులేకుండా గడిపిన రోజులు అనేకం ఉన్నాయని అన్నారు. తన వరకు వచ్చేసరికి ఇప్పుడు ఏడుస్తోందని.. ఇలాంటి ఏడుపులు రోజా తమను నాలుగేళ్ల క్రితమే ఏడిపించిందని వంగలపూడి అనిత అన్నారు. మంత్రి రోజా చేసిన దుర్భాషణలు, చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను త్వరలోనే మరిన్ని బయటపెడతామని వంగలపూడి అనిత హెచ్చరించారు.

More News : దమ్ము ఉంటే ఆ వీడియోలు బయటపెట్టు.. మంత్రి రోజా భర్త సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story