Power Star Pawan Kalyan : సిగ్గూఎగ్గూ లేకుండా పవన్ మాట్లాడుతున్నారు.. మంత్రి రోజా

by Javid Pasha |   ( Updated:2023-07-11 10:59:32.0  )
Power Star Pawan Kalyan : సిగ్గూఎగ్గూ లేకుండా పవన్ మాట్లాడుతున్నారు.. మంత్రి రోజా
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ సిగ్గూఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. మహిళలు, వాలంటీర్లు అంటే పవన్ కల్యాణ్ కు ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. మూడు రోజులుగా పవన్ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లను అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ దుర్మార్గంగా మాట్లాడారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.

పక్క రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటునన్నారని, అది నచ్చక చంద్రబాబు నాయుడు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వణుకు పుడుతోందని అన్నారు. వాలంటీర్ల కాళ్లు పట్టుకొని పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీల కోసం తన అమ్మను, పార్టీ కార్యకర్తలను తిట్టిన బాలకృష్ణకు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా ఉండొద్దనే పవన్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ సీఎం జగన్ తీసుకొచ్చిన విప్లవం అని రోజా కొనియాడారు. వాలంటీర్ వ్యవస్థను బ్రిటిష్, కేరళ ప్రభుత్వాలు పొగిడాయని గుర్తు చేశారు.

Read more : ఇలాంటి అభిమానులు పవన్ కల్యాణ్‌కు మాత్రమే (వీడియో)

Advertisement

Next Story