Minister Roja: స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలు

by srinivas |   ( Updated:2023-03-24 14:49:36.0  )
Minister Roja: స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాఫ్ట్ టెన్నిస్ క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఆర్‌కే రోజా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ మహిళ జట్టు క్రీడాకారులు సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాభివృదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని క్రీడా వసతులు కల్పిస్తామని మంత్రి రోజా హామీ ఇచ్చారు.

ఒడిశాలో 19 నుండి 23 వరకు జరిగిన 19వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించి గోవాలో జరగనున్న నేషనల్ గేమ్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారులను రోజా అభినందించారు. మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. జూలైలో రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి రోజా తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తున్నట్లు క్రీడాకారులకు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి:

సీఎం వైఎస్ జగన్‌తో నాయి బ్రహ్మణులు భేటీ

Advertisement

Next Story