చంద్రబాబు, పవన్‌ను పిచ్చి ఆస్పత్రిలో చేర్చుతాం.. మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు

by srinivas |
చంద్రబాబు, పవన్‌ను పిచ్చి ఆస్పత్రిలో చేర్చుతాం.. మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ సీఎం అవడం ఖాయమని.. ఆ తర్వాత చంద్రబాబునూ, పవన్‌ను పిచ్చి ఆస్పత్రిలో చేర్చుతామని ఆమె హెచ్చరించారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చేస్తున్న చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయం దండగ అని అన్నారని గుర్తు చేశారు. సీఎం జగన్ మాత్రం రైతులకు అండగా ఉంటున్నారని, ప్రకృతి వైఫరిత్యాలు వచ్చినప్పుడు సకాలంలో ఆదుకుంటున్నారని రోజా పేర్కొన్నారు. గడప గడపకు మంత్రులను పంపి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణతో ఏపీకి పోలిక లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతికుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రోజా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed